మియాపూర్, వెలుగు: మియాపూర్‌లోని సర్వే నంబర్100,101లోని హెచ్ఎండీఏ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన మరో10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్పరిధిలో హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించగా అధికారులు వారికి సర్దిచెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదే టైంలో వారిలోని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో మియాపూర్ పోలీసులు 50 మందిపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం 21 మందిని అరెస్ట్ చేశారు. సోమవారం మోహన్, మోహన్‌నాయక్, దేవమ్మ, దినేష్, కుమార్‌నాయక్, కిషన్, రవి, నగేశ్, ప్రభాకర్, మధు అనే పది మందిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పేదలను రెచ్చగొట్టి, వారితో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.