హుజురాబాద్ లో ఎంపీటీసీల తిరుగుబాటు

కరీంనగర్ : నిన్నటి వరకూ జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్లపై నడిచిన అవిశ్వాస తీర్మానాల ఇష్యూ ఇప్పుడు ఎంపీపీల వరకూ పాకింది. తాజాగా హుజురాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణిపై అవిశ్వాసం ప్రకటిస్తూ 10 మంది ఎంపీటీసీలు లేఖ రాశారు. ఈ లేఖను జిల్లా కలెక్టర్ కు ఇచ్చేందుకు ఎంపీటీసీలు కరీంనగర్ కలెక్టరేట్ కు వెళ్లారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ.. తమ ప్రమేయం లేకుండానే ఎంపీపీ ఇరుమల్ల రాణి అవినీతికి పాల్పడుతున్నారని ఎంపీటీసీలు ఆరోపించారు. ఎంపీపీ రాణి భర్త కూడా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి పెద్దరికం చేస్తున్నాడని, బినామీ పేర్లతో కాంట్రాక్టులు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఇష్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.