మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి..10మందికి అస్వస్థత

మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి..10మందికి అస్వస్థత

హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. నిన్న ఖైసర్ అనే యువకుడు మృతి చెందగా..ఇవాళ ఆఫ్రిన్ సుల్తానా మరణించింది. ఈ ఘటనలో మొత్తం 10మంది అస్వస్థతకు గురయ్యారు. అజారుద్దీన్,  సమ్రీన్ బేగం, ఆర్పీ సింగ్, షహజాది బేగం, ఇత్తెషాముద్దీన్, ఇఖ్రాబేగం అస్వస్థతో చికిత్స పొందుతున్నారు.

మరణించిన ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజాబేగం పరిస్థితి విషమంగా ఉంది. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.