హైదరాబాద్ : గగన్ పహాడ్ లోని ఓ స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. స్క్రాప్ దుకాణంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గాయపడిన వారిలో అందరూ యువకులే. సుమారు ఏడుగురికి 70 శాతం గాయాలైనట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎయిర్ పోర్ట్ పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఎలా సంభవించిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఎస్ఎస్ ఎంటర్ ప్రైజెస్ (స్క్రాప్ దుకాణం) యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేశారు.