కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైయున్న ఏడుకొండలకు ఏమైందో ఏమో.. వరస ఘటనలు భక్తులను తీవ్రంగా ఆవేదనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. ఆ ఘటన మరవకముందే.. సోమవారం (జనవరి 13) ఉదయం కొండపై శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్ లో అగ్నిప్రమాదం.. కంప్యూటర్లు పేలి మంటలు వచ్చి.. భక్తులు పరుగులు తీశారు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో ప్రమాదం.. 2025, జనవరి 13న సోమవారం మధ్యాహ్నం తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది. భక్తులను తీసుకుని కొండపైకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్‌రోడ్‌లో అదుపు తప్పి, రక్షణ గోడను ఢీకొంది. ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులు గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పవిత్రమైన తిరుమలలో ఇలా వరుస ప్రమాదాలు గతంలో ఎప్పుడూ జరగలేదంటున్నారు భక్తులు.
ALSO READ | దైవ సన్నిధిలో మరణించడం అదృష్టం.. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు సంచలన వ్యాఖ్యలు..