కరకగూడెం, వెలుగు : రంజాన్ పండగ సందర్భంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో సోమవారం ‘ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు 10 క్వింటళ్ల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుడు షేక్ సోంద్పాషా మాట్లాడుతూ సమాజంలోని పేదలకు సాయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ రంజాన్ పండగను సంతోషంగా జరుపుకోవాలనే ప్రతి సంవత్సరం ఫౌండేషన్ తరుఫున పేదలకు సాయం చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.