
గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని చిన్నపెద్ద చెరువులో మూడు రోజులుగా పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటివరకు 10 క్వింటాళ్ల చేపలను తొలగించినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే నిర్మించిన మురుగునీటి సీవరేజ్ ప్లాంట్వెస్టేజ్మొత్తాన్ని అధికారులు ఈ చెరువులోకే వదలడం, ఓ భారీ అపార్ట్‌మెంట్‌నుంచి వచ్చే డ్రైనేజీ కలవడంతో చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు.
చేపలు మృతి చెందిన విషయాన్ని గ్రామస్తులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, చెరువు నీటి నమునాను ఆదివారం పరీక్షించారు. చెరువులో ఆక్సిజన్ తగ్గడం వల్లే చేపలు మృతి చెందినట్లు గుర్తించారు. ఇప్పటికైనా చెరువు నీటిలో సీవరేజ్వెస్టేజ్కలవకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డ తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు.