కర్ణాటకలో మంత్రివర్గం విస్తరణ

కర్ణాటకలో మంత్రివర్గం విస్తరణ

ఆరు నెలల తర్వాత మళ్లీ తన కేబినెట్‌ను విస్తరించారు కర్ణాటక సీఎం యడియూరప్ప. లేటెస్టుగా 10 మంది రెబల్స్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ వాజుభాయ్‌వాలా ప్రమాణం చేయించారు. పార్టీ మారడంతో అనర్హత వేటుకు గురై తిరిగి ఎన్నికైన సోమశేఖర్‌, రమేష్, ఆనంద్‌సింగ్‌, సుధాకర్‌, బసవరాజ్‌ అరబెయిల్‌ హెబ్బర్‌ శివరాం, హసవనగౌడ, గోపాలయ్య, నారాయణగౌడ, శ్రీమంత్‌ పాటిల్‌ తదితరులకు మంత్రి పదవులు దక్కాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి బయటికి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 13 మంది (శవాళ) గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు.