సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చటోగ్రామ్ వేదికగా జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో ఆటలో బంగ్లాదేశ్ ఒక్క బంతికే 10 పరుగులు చేసింది. అయితే ఇందులో బంగ్లా ప్లేయర్లు ప్రమేయం ఏమీ లేదు. వారి బ్యాట్ నుంచి ఒక్క పరుగు కూడా రాలేదు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు ఆల్ రౌండర్ సేనురన్ ముత్తుసామి పిచ్ మధ్యలో పరిగెత్తాడు. అంపైర్లు హెచ్చరించినా అతను మరోసారి ఆ తప్పిదం చేయడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు దిగకుండానే స్కోర్ బోర్డుపై 5 పరుగులు వచ్చి చేరాయి. మొదటి బంతిని ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా డాట్ వేశాడు. రెండో బంతిని బైస్ రూపంలో ఫోర్ వెళ్ళింది. అయితే అది నో బాల్ గా అంపైర్ ప్రకటించాడు. దీంతో బైస్ ఫోర్ తో పాటు నో బాల్ రూపంలో మొత్తం 5 పరుగులు వచ్చాయి. దీంతో ఒక్క బంతికే 10 పరుగులు బంగ్లా స్కోర్ బోర్డుపై కనిపించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టోనీ డి జోర్జి భారీ సెంచరీకి తోడు, స్టబ్స్, మల్డర్ సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తైజుల్ ఇస్లాం 5 వికెట్లట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇనింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 537 పరుగులు వెనకబడి ఉంది.
Have you ever seen 10 runs scored right after the first delivery in a Test match?
— CricTracker (@Cricketracker) October 30, 2024
📸: Fancode pic.twitter.com/j0lDYEU5h0