![ఎల్ బీ నగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీ.. 10 స్కూల్ వ్యాన్లు సీజ్](https://static.v6velugu.com/uploads/2025/02/10-school-vehicles-seezed-by-lb-nagar-rta--officers_hgMFs4adUT.jpg)
ఎల్బీనగర్, వెలుగు: పెద్ద అంబర్పేటలో గురువారం స్కూల్ వ్యాన్ ఢీకొని చిన్నారి మృతి చెందడంతో సిటీ శివారులోని ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం వనస్థలిపురంలో తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి పిల్లలను కుక్కి, పొల్యూషన్, ఫిట్నెస్సర్టిఫికెట్లు లేకుండా నడుస్తున్న 10 స్కూల్వ్యాన్లను సీజ్ చేశారు. మంగళ్ పల్లి వద్ద గ్లోబల్ వికాస్ లీడర్ షిప్ స్కూల్ వ్యాన్ ను ఆపి తనిఖీచేయగా అందులో 57 మందిని ఎక్కించి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒకే బస్సులో వేర్వేరు స్కూల్స్టూడెంట్లు ఉన్నారు. తనిఖీల్లో ఆర్టీఏ ఆఫీసర్ షేక్ ముని పాల్గొన్నారు.