మధిర/ఎర్రుపాలెం(ఖమ్మం), వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్సే గెలుస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం మధిర పార్టీ ఆఫీసులో భట్టి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కోసమే పాదయాత్ర చేశానని తెలిపారు.
అలాగే ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో భట్టి మీడియాతో మాట్లాడారు. పబ్బులు, క్లబ్బుల కల్చర్ అంటూ రాహుల్ గాంధీపై కేటీఆర్ మాట్లాడటం కరెక్ట్ కాదని, బీఆర్ఎస్ వచ్చాకే హైదరాబాద్లో పబ్ కల్చర్, డ్రగ్స్ వాడకం పెచ్చురిల్లిందని మండిపడ్డారు.
.కేసులకు భయపడి, బీజేపీ లీడర్లతో అంటకాగిన వారు ఈ విధంగా మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు.