రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే నైట్ కర్ప్యూ, లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తాజాగా ముంబైలో ఓ హోటల్ సిబ్బందికి కరోనా రావడంతో.. ఆ హోటల్‌కి వెళ్లిన వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముంబైలోని అంధేరి (వెస్ట్) లోని ఎస్వీ రోడ్‌లో ఉన్న రాధా కృష్ణ రెస్టారెంట్‌లో పనిచేసే 10 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరందరినీ చికిత్స కోసం బీకేసీ జంబో కోవిడ్ సెంటర్‌కు తరలించారు. వెంటనే బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హోటల్ చుట్టపక్కల ప్రాంతాలను శానిటైజ్ చేసి.. హోటల్‌ను క్లోజ్ చేశారు. ఇదేవిధంగా గత వారం హోటల్ ఎక్స్‌ప్రెస్ ఇన్‌లో పనిచేసే 21 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మీరా భయాందర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) హోటల్ ఎక్స్‌ప్రెస్ ఇన్‌కు సీలు వేసింది.