
స్కూళ్లపై ఎండల ప్రభావం కనిపిస్తోంది. జూన్ సగం గడిచినా ఎండలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఎండ తీవ్రంగా ఉంటోంది. దీంతో స్కూల్ కు వెళ్లేందుకు స్టూడెంట్స్ జంకుతున్నారు. గవర్నమెట్ స్కూల్లలో హాజరు తక్కువగా ఉంటోంది. గురువారం శివ్వంపేట మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతిలో 42 మందికి స్టూడెంట్లకు కేవలం10 మంది మాత్రమే హాజరయ్యారు. ఇతర క్లాసుల్లో హాజరు తక్కువగానే ఉంది. శివ్వంపేట ఎస్టీ హాస్టల్లో 142 మంది స్టూడెంట్స్కుగాను కేవలం15 మంది మాత్రమే వచ్చారు. - మెదక్ (శివ్వంపేట), వెలుగు