తెలంగాణలో జూన్ 3 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు

 తెలంగాణలో జూన్ 3 నుంచి  పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో 2024 జూన్ 03 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 13 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 : 30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30  గంటల వరకు అంటే మూడు గంటలు పరీక్ష జరగనుంది.   ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌కు 51వేల 237 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు.  ఇందులో 31 వేల  625 మంది అబ్బాయిలు, 19 వేల 612 మంది అమ్మాయిలు ఉన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 170 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు అధకారులు. 170 మంది చీఫ్ సూప‌రింటెండెంట్లు, 170 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీస‌ర్లు, 1300 మంది ఇన్విజిలేట‌ర్లు విధుల్లో ఉండ‌నున్నారు. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్ టికెట్స్‌ను కూడా ఇప్పటికే విడుద‌ల చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేట‌ర్లు పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకుని రాకూడదు. 

  • జూన్ 3- ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • జూన్‌ 5- సెకండ్ లాంగ్వేజ్‌
  • జూన్‌ 6 - థర్డ్‌ లాంగ్వేజ్
  • జూన్‌ 7 - మ్యాథ్స్‌
  • జూన్ 8- ఫిజికల్ సైన్స్
  • జూన్‌ 10 - బయాలజీ
  • జూన్‌ 11 - సోషల్
  • జూన్ 12 - ఓరియంటల్‌ సబ్జెక్టు పేపర్ 1( సంస్కృతం, అరబిక్)
  • జూన్ 13 - ఓరియంటల్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2