మేడారం జాతరకు 10వేల మంది పోలీసులు

  • డీజీపీ మహేందర్ రెడ్డి 

ములుగు జిల్లా:  మేడారం మహా జాతర కోసం 10 వేల మంది వివిధ హోదాల్లోని పోలీసు సిబ్బంది సేవలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జాతర విధుల్లో ఉండే పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే,డ్యూటీ సక్సస్ గా చేసి  జాతర విజయవంతం అవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.  మేడారం జాతరపై శనివారం మరోసారి సమీక్షించిన ఆయన పలు సూచనలు ఇచ్చారు. మేడారం జాతరను విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జాతర కు వచ్చే ప్రతి వెహికల్ ను సక్సెస్ గా లోపలకి పంపితే ట్రాఫిక్ క్లియర్ అయినట్టే.. ఇబ్బండి ఉండదు అన్నారు.

వీఐపీ, వీవీఐపీ పాసులు, ప్రోటోకాల్ లో ఉన్న వారి వాహనాలతో సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా రోడ్డు మీద వాహనాలకు నిలవకుండా చూసుకోవాలన్నారు. గద్దెల దగ్గర పూజారులతో సత్సంబంధాలు ఉండాలన్నారు. ట్రాఫిక్ డైవర్సన్స్  క్లియర్ చేస్తూ జాతర విజయవంతం చేయాలన్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

ఫ్రీజర్‌‌‌‌లో ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేసేందుకు టిప్స్