మహబూబాబాద్, వెలుగు : పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి, యువతి మృతికి కారణమైన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు, రూ.10 వేల ఫైన్ విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు జడ్జి పి.చంద్రశేఖరప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. మమబూబాబాద్ సిగ్నల్ కాలనీకి చెందిన మనుబోతుల శిరీషను అదే ఏరియాకు శ్యామల కార్తీక్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చూసుకుంటానని నమ్మించాడు.
తర్వాత మోసం చేయడంతో ఆమె పురుగుల మందు తాగి చనిపోయింది. దీంతో శిరీష తల్లి యశోధ ఫిర్యాదుతో 2017 డిసెంబర్ 24న పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం నిరూపణ కావడంతో కార్తీక్‌కు జైలు శిఖ, జరిమానా విధించారు. నేర నిరూపణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, కోర్టు కానిస్టేబుల్ భుక్యా రవీందర్ కీలకంగా పనిచేశారు.
మైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి...
ఎల్కతుర్తి, వెలుగు : బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యవకుడికి రెండేళ్ల జైలు విధిస్తూ జడ్జి అపర్ణాదేవి గురువారం తీర్పు చెప్పారు. ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక 2019 జనవరి 18 బయటకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన మారేపల్లి అనిరుథ్ అసభ్యంగా ప్రవర్తించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై సజ్జనపు శ్రీధర్ కేసు నమోదు చేశారు.
అనిరుథ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం నిరూపణ కావడంతో యువకుడికి రెండేళ్ల జైలు, రూ. 4 వేల ఫైన్‌తో పాటు, బాధితురాలికి రూ. 50 వేలు ఇవ్వాలని జడ్జి తీర్పు చేశారు. అలాగే ఇదే యువకుడు అదే బాలికను ఆగస్టు 9న మరోసారి వేధించడంతో కేసు నమోదు అయింది. ఈ కేసులో కూడా రెండేళ్ల జైలుతో పాటు, రూ. 2 వేల జరిమానా, రూ. బాధితురాలికి రూ. 50 వేలు ఇచ్చేలా తీర్పు చెప్పారు. ల రూపాయలు బాధితురాలికి ఇచ్చే విధంగా తీర్పు చెప్పారు.