మెదక్ (మనోహరాబాద్), వెలుగు: కల్తీ కల్లు తయారు చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మెదక్ ఒకటో అడిషనల్ సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద బుధవారం తీర్పు ఇచ్చినట్లు నర్సాపూర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పద్మ తెలిపారు. ఆమె వివరాల ప్రకారం.. 2016 ఏప్రిల్12న మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లిలోని కల్లు దుకాణంలో ఎక్సైజ్ ఆఫీసర్లు తనిఖీ చేశారు. అనుమానం రావడంతో శాంపిల్స్తీసుకొని నిజామాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు.
Also Read:క్షుద్ర పూజలు చేస్తోందని వృద్ధురాలిపై దాడి
కల్లులో నిషేధిత అల్ప్రజోలం అనే మత్తు పదార్థం ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి ఆధారాలు కోర్టుకు అందజేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కల్తీ కల్లు తయారు చేసిన నిందితుడు గులయ్యగారి నర్సాగౌడ్‌కు పదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. లక్ష జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.