మంచిర్యాల జిల్లాలో పదేండ్ల బాలిక గుండెపోటుతో మృతి..

జన్నారం, వెలుగు: గుండె పోటుతో బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన దిగుట్ల నాగరాజు, అనుష దంపతులకు కొడుకు, కూతురు సమన్విత(10) ఉన్నారు. బాలిక మండల కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్​లో 4వ తరగతి చదువుతుంది. బాలిక గురువారం ఉదయం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పి సృహకోల్పోయింది.

వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయస్సులోనే సమన్విత మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.