దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రళయం..లాస్ ఏంజిల్స్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పాలిసేడ్స్ ఫైర్ అత్యంత విధ్వంసం సృష్టించింది.దీనికి తోడు శాంటాఆనా గాలులు మంటలకు ఆజ్యం పోస్తున్నాయి..వేలాది ఇండ్లు,వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. హాలివుడ్ నటులతో సహా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు ఐదుగురు మంటల్లో సజీవ దహనం అయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు1.5 మిలియన్ల ప్రజలు కరెంట్ లేక అంధకారంలో ఉన్నారు. మంటలను అదుపు చేసేందుకు అక్కడి ఫైర్ సేఫ్టీ టీమ్స్ నిరంతరంగా శ్రమిస్తున్నాయి.
లాస్ ఏంజిల్ లో అటవీప్రాంతంలో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతూనే ఉంది.. రోజులు గడుస్తున్న కొద్దీ మంటలు పెరుగుతూనే ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ నగరాన్ని చుట్టుముడుతున్నాయి. ఇల్లు, వాహనాలు, చెట్లు ఇలా దేన్నీ వదలకుండా కాల్చేస్తున్నాయి.
This is by far the craziest video from the fire in Los Angeles. This guy is filming huge walls of fire surrounding a house they're in, and there's another person and a dog. I have no idea why they didn't evacuate or what happened to them. Let's hope they're okay. #PalisadesFire pic.twitter.com/QYtsBSKvdl
— Sia Kordestani (@SiaKordestani) January 8, 2025
దక్షిణ కాలిఫోర్నియాలో ముఖ్య పట్టణం..ధనవంతులుండే నగరం అయిన లాజ్ ఏంజిల్స్ లో హాలివుడ్ ప్రముఖులంతా దాదాపు అక్కడే ఉన్నారు.. లక్షలాది మంది ప్రజల ఇండ్లతో పాటు వారి ఇండ్లు కూడా మంటలలో కాలిపోయాయి.
ఈ వారం ప్రారంభంలో దక్షిణ కాలిఫోర్నియాలో అటవీప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు..బుధవారం లాస్ ఏంజిల్స్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది విల్లాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంపన్న వర్గాలు అధికంగా ఉండే పాలిసాడ్స్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా దగ్ధమైంది. అగ్ని మాపక అధికారులు రెస్క్యూ చేసి 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.