హైదరాబాద్ లో జూన్ 24 రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంజాగుట్ట,సోమాజిగూడ, అమీర్ పేట, మూసాపేట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ మియాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ వంటి ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయాయి. కరెంట్ పోల్స్ పడిపోయాయి. కొన్ని చోట్ల పాత బిల్డింగ్స్ కూలిపోయాయి.
దీంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 100 వరకు ఫిర్యాదులు రాగా.. డీఆర్ఎఫ్కు 48 ఫిర్యాదులు వచ్చాయి. చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయని 24 కంప్లైంట్స్, నీళ్లు నిలిచిపోయాయని 22 కంప్లైంట్స్, గోడలు/బిల్డింగ్స్ కూలిపోయాయని 2 ఫిర్యాదులు వచ్చాయి.