కామేపల్లి, వెలుగు: ఇల్లందు ఎమ్మెల్యే, ఆమె భర్త అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ మండలంలోని బండిపాడు, రాయిగూడెం, రుక్కితండాలో బీఆర్ఎస్ కు చెందిన100 కుటుంబాలు పార్టీకి గురువారం రాజీనామా చేశారు. డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య బాటలో పయనిస్తామని తెలిపారు. బానోత్హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ తీరుతో విసిగిపోయామని, వాళ్ల వ్యక్తిగత అభివృద్ధి కోసమే పాటు పడ్డారని ఆరోపించారు.
బంగారు తెలంగాణ లక్ష్యంగా కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఈనాటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చేసిందేమి లేదన్నారు. తండాలకు అభివృద్ధి నిధులు ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవని, కేసీఆర్ హామీలు నీటి మూటలుగా మారాయని విమర్శించారు. ప్రోగ్రాంలో బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బానోత్ నరసింహ నాయక్, పొంగులేటి వర్గం లీడర్లు శీలం పుల్లయ్య, మేకపోతుల మహేశ్, టి. ముత్తయ్య, బండి లచ్చి నర్సు పాల్గొన్నారు.