ఖమ్మం రూరల్, వెలుగు : పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్‌షాక్ తగిలింది. ఖమ్మం కార్పొరేషన్‌లోని 59వ డివిజన్ దానవాయిగూడెం గ్రామానికి చెందిన వంద కుటుంబాలు, నడిమితండా నుంచి పలువురు బుధవారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక నాయకులు చల్లా కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో వీరికి ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో గంగిసరప కొండలు, పల్లపు ఉపేందర్, ఐతబోయిన శ్రీను, కన్నం బాలకృష్ణ, పడిశాల రాజేశ్, బొడ్డు రామారావు, ఇమామ్ సాబ్, వండ్ర పుల్లయ్య, వంశీ, భూక్యా సర్వర్ సింగ్, ధరావత్ బాలు, ధరావత్ సునీల్ కుమార్, భూక్యా రాజేశ్, బానోత్ శంకర్, బానోత్ అవినాష్, బానోత్ సాయి, భూక్యా కళ్యాణ్, గుగులోత్ శ్యామ్ ఉన్నారు.
బొడ్రాయి ప్రతిష్ఠ వేడుకల్లో.. .
మండలంలోని దారేడులో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి హర్ష రెడ్డి హాజరై పూజలు చేశారు. హనుమాన్ ఆలయం వద్ద యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం బత్తుల పృథ్వి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి ముత్యాలగూడెంలో ముదిరాజ్ సంఘం నేత యాట శ్రీను నివాసంలో ముదిరాజ్ సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌నాయకుల హరనాథ్‌బాబు, దారేడు సర్పంచ్ తూరుగంటి సంగులు, ఏనుగు వెంకటరెడ్డి, ప్రతాపనేని రఘు, యాదాల లింగయ్య, తోడేటి సైదులు, కిషోర్ రెడ్డి, కాలింగ్ లక్ష్మయ్య, తాళ్ల సంగయ్య, చింతకాయల చిన్న వెంకన్న, కాలింగ్ మోహన్ పాల్గొన్నారు.
‘గడప గడపకు కాంగ్రెస్’
కూసుమంచి, వెలుగు : మండలంలోని పురియాతండాలో బుధవారం నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. పార్టీ నాయకులు బజ్జూరి వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రవి, మైపాల్ ఉన్నారు.