అశ్వాపురం, వెలుగు: అశ్వాపురం మండల కల్యాణపురం గ్రామానికి చెందిన 100 కుటుంబాలు ఆదివారం బీఆర్ఎస్పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాయి. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్వైఖరి నచ్చక, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ లీడర్ తుళ్లూరు బ్రహ్మయ్య, గాద కేశవరెడ్డి, ముత్తినేని సుజాత, శ్రీనివాస్, వేములపల్లి రమేశ్పాల్గొన్నారు.