న్యూఢిల్లీ:ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి 100 శాతం ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ల(ఎఫ్‌డీఐల) కు అనుమతిచ్చే బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లో ప్రవేశపెట్టకపోవచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా డ్రాఫ్ట్ బిల్లుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు. వచ్చే ఏడాది బడ్జెట్ సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టొచ్చని అన్నారు. ఇన్సూరెన్స్ చట్టం 1938 కి వివిధ సవరణలు చేయాలని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రపోజ్ చేసింది.
ఈ సెక్టార్‌లో ఎఫ్‌డీఐల లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం, పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించడం, కంపెనీలు వివిధ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయడానికి వీలుకల్పించడం వంటివి ప్రపోజ్ చేసింది.