రాజకీయం చేయకండి.. ఓవర్ హీట్ కారణంగా చనిపోయారు : మంత్రి మా సుబ్రమణియన్

రాజకీయం చేయకండి.. ఓవర్ హీట్ కారణంగా చనిపోయారు : మంత్రి మా సుబ్రమణియన్

తమిళనాడులోని మెరినా బీచ్ లో ఆదివారం (అక్టోంబర్ 7)న భారత వైమానికి దళం ఎయిర్ షోను నిర్వహించింది. వైమానికి ప్రదర్శణ చూడటానికి వచ్చిన వారిలో 100 మంది దాకా అస్వస్తతకు గురైయారు. ఓవర్ హీట్ కారణంగా డీహైడ్రేట్ అయ్యి వారు హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని తమిళనాడు వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మా సుబ్రమణియన్ సోమవారం అన్నారు.

వారిలో ఐదుగురు చనిపోయారని.. మిగిలిన వారు కోలుకుంటున్నారని ఆయన మీడియాకు తెలిపారు. ఈ సమస్యను రాజకీయం చేయవద్దని రాజకీయ పార్టీలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. మెరీనా బీచ్‌కు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన దాదాపు 100 మందిలో 7 మంది చికిత్స పొందుతుండగా, 93 మంది ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఐదుగురు వ్యక్తులను ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు సుబ్రమణ్యం తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రేక్షకులు అదే సమయంలో ఇళ్లకు బయలుదేరడం ప్రారంభించినప్పటికీ తొక్కిసలాట జరగలేదని ఆయన అన్నారు.

ALSO READ | చెన్నై ఐఏఎఫ్​ ఎయిర్ షోలో అపశ్రుతి

ఎయిర్ షో చూడటానికి వచ్చిన వారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉన్న ఎండ కారణంగా ఇలా జరిగిందని మంత్రి అన్నారు. IAF 92వ దినోత్సవ వేడుకల కోసం 15 లక్షల మందిని ఊహించి ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. కానీ అక్కడకి అనుకున్న దానికంటే ఎక్కువమంది వచ్చారని అన్నారు. వారు వచ్చే తప్పుడు గొడుగులు, తలపు కప్పే టోపీ లాంటివి ఏవీ తెచ్చుకోలేదని ఆయన అన్నారు.