నిమ్స్ లో ఈ ఏడాది 100 కిడ్నీ ఆపరేషన్లు

నిమ్స్ లో ఈ ఏడాది 100 కిడ్నీ ఆపరేషన్లు

హైదరాబాద్: దీర్ఘ కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధ పడుతున్న రోగులకు నిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సతో విశేష సేవలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం నూరవ కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసారు.  దేవరపల్లి, చేవేళ్లకి చెందిన  లక్ష్మమ్మ అనే మహిళ.. తన కుమారుడు శేఖర్ కి కిడ్నీ దానం చేసింది. హాస్పిటల్ లో జరిగిన ఈ 100 వ ఆపరేషన్ సక్సెస్ అయిందని.. తల్లి కొడుకులు ప్రస్తుతం కోలుకుంటున్నారని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.

గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వందకు పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ జరిగాయని, గత 8 సంవత్సరాలలో 700 పైగా చికిత్సలు విజయవంతంగా జరిగాయన్నారు వైద్యులు. నిమ్స్ యూరాలజీ వైద్యులు ప్రొఫెసర్ రాంరెడ్డి(HOD) , ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ ,డాక్టర్  విద్య  సాగర్ , డాక్టర్  రామ్ చంద్రయ్య,  డాక్టర్  రఘువేర్, డాక్టర్  చరణ్  ఈ ఆపరేషన్ లలో కీలక పాత్ర వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాంరెడ్డి…  తెలంగాణ ప్రభుత్వానికి,నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ కి ,మెడికల్ సూపెరిండెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

100 kidney operations done in Nims hospital in this year