
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల నుంచి ప్రధాన పార్టీలకు చెందిన వంద మంది నేతలు గురువారం పాలమూరు బీఎస్పీ అభ్యర్థి స్వప్న శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోందన్నారు.
త్వరలో పాలమూరులో పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ALSO READ : పోస్టల్‌బ్యాలెట్ ను వినియోగించుకోవాలి : కలెక్టర్ హనుమంతు జెండగే