బీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి 100 మంది బీజేపీలో చేరారు:ఎంపీ అర్వింద్

జగిత్యాల జిల్లాలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సర్పంచుల నుంచి కార్యకర్తల వరకు కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది బీజేపీలో చేరారు. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలకు అర్వింద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అంతకు ముందు అర్వింద్ రాయికల్ మండలంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అల్లిపూర్ గ్రామంలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.అనంతరం అల్లిపూర్ నుంచి రాయికల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయికల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.