తెలంగాణలో కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు

తెలంగాణలో  కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలకు సత్వర సేవలు అందించ డంలో భాగంగా కార్యాచరణ చేపట్టింది. సస్పె క్టర్ ఎస్చ్గా ఉన్న పోలీస్ స్టేషన్లను సర్కిల్గా అప్గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్స్, ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రపోజల్స్ రెడీ చేసింది. ఈ మేరకు మల్టీజోన్ల వారీగా అవసరమైన పోలీస్ స్టేషన్ల వివ రాలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాలను నియంత్రించేం దుకు అనువుగా కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తు న్నారు. దీంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టారు.

ప్రమోషన్లు, ప్రజలకు సత్వర సేవలు

పోలీస్ స్టేషన్లు అప్గ్రేడ్ చేయడం ద్వారా  సీనియర్ పోలీస్ అధికారులకు పదోన్నతులు లభిస్తాయి. దీంతో పాటు స్థానిక ప్రజలకు డీఎస్పీ స్థాయి అధికానిరంతరం అందుబాటులో ఉండే అవకాశా లు ఉంటాయి. సైబర్ క్రైమ్, మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం ద్వారా బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టారు. కొంత కాలంగా రాష్ట్రంలో పలు అవాంఛనీయ ఘటనలు జరిగిన నేపథ్యంలో.. శాంతిభద్రతలపైనే పోలీస్ డిపార్ట్మెంట్ మరింత దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నే గతంలో నమోదైన కేసులు పోలీస్ స్టేషన్ల పరిధి ఆధారంగా సబ్ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పీఎస్లను కూడా సమీ పంలోని జిల్లా యూనిట్కు కేటాయించే విధంగా చర్యలు చేపట్టారు.

మహిళా భద్రతకు పెద్ద పీట

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 844 పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఇప్పటికే యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహా రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వాటిలో దాదాపు 40 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, మరో 20 మహిళాపోలీస్ స్టేషన్లకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మల్టీజోన్ -1 మల్టీజోన్-2 లో అప్ గ్రేడ్ చేయాల్సిన పోలీస్ స్టేషన్ల వివరాలను డీజీపీ ఆఫీసు ప్రభుత్వానికి అందించింది. కేటగిరీల వారిగా ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఆమోదం వచ్చిన తరువాత అన్ని యూనిట్లలో పీఎస్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.