- 2014 ముందు ఎటువంటి ఆక్రమణకు గురికానివి
- 2014కు ముందు పాక్షికంగా కబ్జాకు గురైన చెరువులు
- 2014 నుంచి 2023 దాకా పూర్తిగా కబ్జా అయినవి
హైదరాబాద్..వేయి సరస్సుల నగరంగా పేరు పొందింది. తాగునీటి అవసరాలకే కాకుండా వ్యవసాయానికి కూడా చెరువుల నీళ్లను వాడిన చరిత్ర మన నగరానిది. ఒకప్పుడు ఏ చెరువు చూసినా కళకళలాడుతూ కనిపించేది. వర్షం పడినప్పుడు వరద ఎక్కడా ఆగకుండా సరాసరి చెరువుల్లో చేరి నిండుకుండలను తలపించేవి. అలాంటి చెరువులు ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు. సిటీలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల 920 వరకు చెరువులుండేవని అధికారుల అంచనా. అయితే, కబ్జారాయుళ్ల కన్ను పడి ఇందులో చాలా చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. కొందరు మట్టి పోసుకుంటూ మాయం చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోగా, మరికొందరు ఇండ్లను కట్టి అమ్మి కాలనీలు సృష్టించారు. ఇంకొందరు కమర్షియల్ అవసరాల కోసం నామరూపాల్లేకుండా చేశారు. ఇలా తెలంగాణ ఏర్పడే నాటికే సిటీలో 225 చెరువులు పూర్తిగా కనిపించకుండా పోగా, 196 సరస్సులు సగానికి పైగా ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో చినుకు పడితే చాలు చెరువులున్న ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన వరద లోతట్టు ప్రాంతాలకు పారి అక్కడి పేదల ఇండ్లను ముంచుతోంది. భవిష్యత్‌లో ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ సర్కారు చెరువుల పరిరక్షణకు నడుం బిగించింది. చెరువుల్లో ఆక్రమణలను గుర్తిస్తూ ఒక్కొక్కటిగా కట్టడాలను కూల్చివేస్తోంది. ఆ చర్యల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియేట్‌లో మాయమైన చెరువుల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నగరంలో చెరువుల పూర్వపు స్థితి...ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు..అందులో 44 చెరువులు 100 శాతం కబ్జాకు గురయ్యాయని ప్రకటించారు. అందులో కొన్ని ఫొటోలివి. – హైదరాబాద్ సిటీ, వెలుగు