
కొల్చారం, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొల్చారం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంగాయిపేట తండా పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ నమోదు అయింది. సంగాయిపేట తండాకు సంబంధించిన 62వ నంబర్ పోలింగ్ కేంద్రం సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండడంతో సంగాయిపేటలో అదనపు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ సోమవారం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 100 శాతం పోలింగ్ నమోదైంది. .తండావాసుల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.