పాటియాలా: పంజాబ్‌లోని పాటియాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 102 మందికి కరోనా సోకింది. ఈ కేసుల్లో ఒమిక్రాన్ ఉందేమోననే అనుమానంతో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని వైద్యాధికారులు తెలిపారు. కాగా, ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవ్వవడంతో ముందస్తు జాగ్రత్తగా నగరంలోని విద్యా సంస్థలను మూసేస్తున్నట్లు పాటియాలా డీసీ సందీప్ హన్స్ తెలిపారు.
Punjab | 102 #COVID19 cases reported in Govt Medical College, Patiala. All the cases are likely to be of the #Omicron variant. The samples have been sent for genome sequencing. Patiala administration has decided to shut all educational institutions: Patiala DC Sandeep Hans pic.twitter.com/dizw2IvxZK
— ANI (@ANI) January 4, 2022
గత వారంలో పాటియాలాలోని థాపర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 93 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇకపోతే, ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యా విధించాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. గత కొన్ని వారాల్లో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో స్కూళ్లు, కాలేజీలను కూడా మూసి వేయాలని ఆదేశించింది.
మరిన్ని వార్తల కోసం: