ఢిల్లీలో వెయ్యికి పైగా కేసులు వారివే

కరోనా కేసుల విషయంలో హర్యానా, ఢిల్లీ హెల్త్ మినిస్టర్ల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. కరోనా కేసుల పెరుగుదల సందర్భంగా హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ... రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో ఆనుకొని ఉన్న మూడు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందన్నారు. ఢిల్లీలో కోవిడ్ ను సరిగా నియంత్రించడం లేదని ఆరోపించారు.ఆ ప్రభావం హర్యానపై పడుతుందని అనిల్ విజ్ విమర్శించారు.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు అనిల్ విజ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ స్పందించారు.

ఇవి రాజకీయంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అన్నారు. ఢిల్లీలో ఎంతమంది హర్యానా ప్రజలు కరోనా బారిన పడుతున్నారో తాను లెక్కలతో సహా చెప్పగలనన్నారు. దేశ రాజధానిలో నిత్యం నమోదైన కేసుల్లో 1000 కేసులు బయట నుంచి వచ్చిన వారివే అన్నారు సత్యేంద్ర జైన్. ఢిల్లీలో ఈ రోజు దాదాపు 14,000-15,000 కేసులు నమోదయ్యే  అవకాశం ఉందన్నారు. ఇది ఒక రోజు కంటే చాలా తక్కువ. ఢిల్లీలో సుమారు 2.85 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామన్నారు. 100% అర్హులైన జనాభాకు 1వ డోస్, 80% మందికి కరోనా రెండవ డోస్, 1.28 లక్షల మంది ప్రజలు బూస్టర్ డోస్ పొందారన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్.

 

ఇవి కూడా చదవండి:

వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం

ఒక్క రోజే రెండున్నర లక్షల కరోనా కేసులు