- దసరాకు ముందు రోజు రూ.205 కోట్ల స్టాక్ అవుట్
- పండుగ రోజు, మరునాడూ రెట్టింపు అమ్మకాలు
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. రాష్ట్రంలో 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి. దసరాకు మందు భారీగా అమ్ముడుపోతుందని ముందే ఊహించిన వ్యాపారులు పెద్ద మొత్తంలో స్టాక్ నిల్వ చేసుకున్నారు. అంచనా వేసినట్టే వైన్ షాపుల నిర్వాహకులు నిల్వ చేసుకున్న స్టాక్అంతా దాదాపుగా సేల్ అయిపోయింది. దసరాకు ముందరోజు శుక్రవారమే రూ.205 కోట్ల స్టాక్ ఎక్సైజ్ డిపోల నుంచి వైన్ షాపులకు, బార్లకు, క్లబ్‌లకు, పబ్‌లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక ఈ నెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు 11 రోజుల్లో రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది. ఇందులో ఈ నెల 10వ తేదీ వరకు రూ.852.4 కోట్ల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్, 14.53 లక్షల కేసుల బీరు సేల్ అయింది. అయితే ఒక్క శుక్రవారం రోజునే ఎక్సైజ్ డిపోల నుంచి వైన్ షాపులకు రూ.205.42 కోట్ల విలువైన 2.08 లక్షల కేసుల లిక్కర్, 3.07 లక్షల కేసుల బీరు వైన్స్ నిర్వాహకులు తెచ్చుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అలాగే శని, ఆదివారాల్లో కూడా మద్యం రెట్టింపు స్థాయిలో అమ్ముడుపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా భారీ చోట్ల భారీగా మద్యం అమ్మకాలు..
- అక్టోబరు 5 నుంచి 11 వరకు సుమారుగా 820 కోట్ల మద్యం అమ్మకాలు..
- అక్టోబరు 5 న 127 కోట్ల 18 లక్షలు
- 6 న ఆదివారం లిక్కర్ గౌడన్లకు సెలవు
- 7 న , 129 కోట్ల 39 లక్షలు
- 8 న 102 కోట్ల 93 లక్షలు
- 9 న 120 కోట్ల 16 లక్షలు
- 10 న 139 కోట్ల 16 లక్షలు
- 11 న 200 కోట్ల కు పైగానే మద్యం సేల్
- దసరా పండుగ సందర్భంగా 6 రోజుల్లోనే 820 కోట్ల కు పైగా లిక్కర్ సేల్
- రోజుకు కోటి పైనే లిక్కర్ సేల్
గ్రేటర్ లో కొద్దిగా తగ్గిన మద్యం సేల్:
- హైదరాబాద్, సికింద్రబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి , సరూర్ నగర్, శంషాబాద్ వికారాబాద్ ఎక్సైజ్ జిల్లాలు..
- గత ఏడాది తో పోలిస్తే తగ్గిన మద్యం సేల్
- గ్రేటర్ పరిధిలోనే 674 మద్యం దుకాణాలు
- గత ఏడాది 317.23 కోట్లు అమ్మకాలు జరుగా
- ప్రస్తుతం మద్యం సేల్: 312 కోట్లు మాత్రమే