బుల్లెట్ బండెక్కి సాంగ్ కు ఒకేసారి 1000 మంది డ్యాన్స్

బుల్లెట్ బండెక్కి సాంగ్ కు ఒకేసారి 1000 మంది డ్యాన్స్

జగిత్యాల జిల్లా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. వెయ్యి మంది ఒకేసారి బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేశారు. ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం వెయ్యిమందితో బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ చేయించారు నిర్వాహకులు మచ్చ రవి. ఐదు నిమిషాలపాటు ఒకే తరహాలో 1000 మందికి పైగా ఆడపిల్లలు, చిన్నారుల డాన్స్  చేశారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించి... రికార్డ్స్ లో పేరు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. ధృవీకరణ పత్రాన్ని, రికార్డ్స్ మెమెంటోను కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మచ్చ రవికి అందజేశారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జగిత్యాల పేరు నమోదు కావడం గర్వకారణమన్నారు మచ్చ రవి. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు హాజరయ్యారని..నెల రోజుల పాటు శిక్షణ తీసుకొని ప్రదర్శనలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, ఎస్ రవి శంకర్, జిల్లా కలెక్టర్ జి. రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

పక్క దేశాలకు నడిచి పోతున్రు

మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే