మహాశివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహా శివరాత్రి జాతరకు వెయ్యి  ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్​ ఈడీ వినోద్​కుమార్​ తెలిపారు. సోమవారం వేములవాడలో కరీంనగర్, వరంగల్, నిజామబాద్, నిర్మల్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.  జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

7న 265, 8న 400, 9న 329 బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఈ బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్​పల్లి, ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడిపిస్తామన్నారు. ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో

ఉచితంగా 14 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం సుచరిత, డిప్యూటీ ఆర్ఎం  భూపతి రెడ్డి,  డిప్యూటీ ఆర్ఎంఎం సత్యనారాయణ, ఈడీ సెక్రటరీ యుగంధర్ రెడ్డి,  వివిధ డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.