మెక్సికోలో వెయ్యేళ్ల నాటి మానవేతర మమ్మీస్ బయటపడ్డాయి. వీటిని ఏలియన్స్ బాడీస్ గా, వీటి నమూనాలు వెయ్యేండ్ల కిందటివని అక్కడి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రజల వీక్షణ కోసం పారదర్శక పెట్టెలలో చిన్న మానవేతర శరీరాలను మెక్సికో కాంగ్రెస్ లో ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర, చర్చకు దారితీసింది.
మెక్సికోకు చెందిన జర్నలిస్ట్, యూఫాలజిస్ట్ జైమ్ మౌసాన్ వెయ్యేండ్ల కిందటి రెండు గ్రహాంతర వ్యక్తుల పురాతన శిలాజ అవశేషాలను డయాటమ్ [ఆల్గే] గనులలో గుర్తించారు. రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతులను ఉపయోగించి నమూనాల నుండి DNA ఆధారాలను శాస్త్రవేత్తలు సేకరించారు. మెక్సికోలో గుర్తించబడని ఎగిరే వస్తువులపై బ్రీఫింగ్ సందర్భంగా ఈ మానవేతర జీవుల అవశేషాలు ప్రదర్శనలో ఉంచారు.
పెరూలోని కుస్కో నుంచి సేకరించిన రెండు చిన్న శవాలు పరిశీలనకోసం నిన్న (సెప్టెంబర్ 12న) ప్రదర్శనకు ఉంచారు. ఈ మమ్మీ నమూనా వెయ్యేండ్ల కిందటిదని నిర్వాహకులు పేర్కొన్నారు. మెక్సికోలోని అటానమస్ నేషనల్ యూనివర్శిటీలో UFO నమూనా అధ్యయనం చేయబడిందని మౌసాన్ మెక్సికన్ ప్రభుత్వ సభ్యులతో చెప్పారు. ఇక్కడ శాస్త్రవేత్తలు రేడియోకార్బన్ డేటింగ్ ఉపయోగించి DNA ఆధారాలను గీయగలిగారు.
In the lower chamber of the Mexican Congress, @jaimemaussan1 presented what he claims are two alien corpses.
— Jeff Dornik (@jeffdornik) September 13, 2023
This is wild, if true.
Do you think this is legit alien bodies? Or is it fake? Or some other explanation altogether?
(I translated into English the subtitles) pic.twitter.com/lbSUMi6tnZ