బీజింగ్: చైనాలో ఓ వ్యక్తి చేసిన తప్పుకు 1,000 మంది క్వారెంటైన్ అవ్వాల్సి వచ్చింది. బీజింగ్‌కు చెందిన 40 ఏండ్ల వ్యక్తి క్వారెంటైన్ నుంచి తప్పించుకొని బయటికొచ్చిండు. ఇంటి చుట్టు పక్కల వారి ని కలిశాడు. షాపింగ్ చేశాడు. అతడిని పట్టుకొని టెస్ట్ చేయగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత అతడు ఉండేచోట 1,000 మందిని అధికారులు క్వారెంటైన్ చేశారు. అతని భార్యకు కూడా పాజిటివ్ రావడంతో, మరో 5 వేల మందిని ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు. అందులో 250 మందిని ప్రభుత్వ క్వారెంటైన్‌కు తరలించారు. క్వారెంటైన్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారు. మరోవైపు చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా అక్కడ 66 మందికి కరోనా నిర్ధారణ అయింది. బీజింగ్ లో మరో 12 మంది వైరస్ సోకినట్లు తేలింది. ఈనేపథ్యంలో జీరో కొవిడ్ పాలసీతో చైనా సర్కారు ముందుకుపోతోంది. కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు, పోలీసు కేసులతో కొరడా ఝుళిపిస్తోంది. జీరో కొవిడ్ పాలసీ వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షాంఘైలో దాదాపు రెండు నెలల పాటు అమలుచేసిన కఠిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే బందీలుగా మారి ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేస్తున్నాయి.
క్వారెంటైన్ నుంచి బయటికెళ్లిండు.. వెయ్యి మందిని తోడు తెచ్చుకుండు
- విదేశం
- May 31, 2022
లేటెస్ట్
- ఇలా ఎలా నమ్ముతారో.. గాడిద పాల పేరిట వంద కోట్ల మోసం.. నిండా ముంచేశారు..!
- వామ్మో.. కేపీహెచ్బీలో ఇలాంటోళ్లు కూడా ఉన్నరు.. జర పైలం..
- KA Movie: రూ.50 కోట్లు కలెక్షన్స్ మార్క్ అందుకున్న కిరణ్ అబ్బవరం "క" సినిమా.
- పాపం.. ఇద్దరూ 30 ఏళ్ల లోపు కుర్రాళ్లు.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర విషాద ఘటన
- ఇల్లు చమక్ చమక్ మెరిసిపోవాలా..? అయితే లైటింగ్ సిస్టమ్ ఇలా సెట్ చేసుకోండి
- Post Office RD Scheme: పోస్టాఫీసు బెస్ట్ స్కీం..ప్రతి నెలా 5వేల పెట్టుబడి..చేతికి 8.5లక్షల రాబడి
- ఒంట్లో మొండి కొవ్వు కరిగించాలంటే..ఒళ్లు వంచాల్సిందే!
- India vs India A: ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుర్రాళ్ళ ధాటికి విల విల.. కోహ్లీతో పాటు ఇద్దరికి గాయాలు
- హైదరాబాద్‌లో అలెగ్రో మైక్రో సిస్టమ్: మంత్రి శ్రీధర్ బాబు
- Kubera glimpse out: కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కుబేర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
Most Read News
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- గోవాలో మద్యం కొంటున్న వీడియోపై స్పందించిన అల్లు అర్జున్..
- హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్‌కు ఈ సంగతి తెలిస్తే అంతే..!
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాతో చివరి టీ20.. రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్
- తార్నాకలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..