ఏపీలో ఒక్క రోజే 97 మంది కరోనా పేషెంట్లు మృతి: కొత్తగా 10,080 కేసులు

ఏపీలో ఒక్క రోజే 97 మంది కరోనా పేషెంట్లు మృతి: కొత్తగా 10,080 కేసులు

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,080 కొత్త కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు క‌రోనా బారినపడిన వారి సంఖ్య 2,17,040కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 9,151 మంది కరోనాను జయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,29,615 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 85,486 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1353, తూర్పు గోదావరి జిల్లాలో 1310, విశాఖలో 998, అనంతపురంలో 976, చిత్తూరులో 963 మంది కరోనా బారినపడ్డారు. ఇక ఈ ఒక్క రోజులో క‌రోనా కార‌ణంగా 97 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 14, అనంతపురంలో 11 మంది, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనాకు బలయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో నలుగురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1939కి చేరింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు: