రాయికల్, వెలుగు: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని శ్రీగిరి పర్వతం పై కొలువుదీరిన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి ఆదివారం 101 మంది భక్తులు బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లతో గ్రామం నుంచి బోనం ఎత్తుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడుబుస గంగ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి అమరేందర్, ట్రెజరర్ బేతి రాజు, సభ్యులు, మాలదారులు పాల్గొన్నారు.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గమ్మను వేడుకున్నట్లు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. రాయికల్ పట్టణంలోని సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమాత ఉత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట లీడర్లు కొయ్యడి మహిపాల్, దివాకర్‌రెడ్డి, భూమయ్య, రాజరెడ్డి పాల్గొన్నారు.