కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

కరోనా వచ్చిందంటే చాలు చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమందైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరోనాకు భయపడే వాళ్లందరికీ స్పూర్తిగా నిలిచింది తిరుపతికి చెందిన 101 సంవత్సరాల బామ్మ.

తిరుపతికి చెందిన 101 ఏళ్ల మంగమ్మ అనే వృద్ధురాలు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడింది. దాంతో ఆమెను తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉమెన్స్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆమె అక్కడి డాక్టర్లకు, మెడికల్ సిబ్బందికి సహకరిస్తూ.. వైద్యం చేయించుకొని కరోనాను జయించింది. ఈ నెల 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయింది.

రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటిండెంట్ రామ్ మాట్లాడుతూ.. ‘101 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. పూర్తి ఆరోగ్యంతో నిన్న డిశ్చార్జ్ అయింది. కరోనాకు భయపడే వాళ్లందరికీ ఈ బామ్మ మంచి ఉదాహరణ. కరోనా వచ్చిందని భయపడిపోకుండా.. ధైర్యంగా ఉంటూ నమ్మకంతో మెడికల్ సిబ్బందికి సహకరిస్తే కరోనా నయమవుతుంది’ అని ఆయన అన్నారు. మంగమ్మ కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో ఆమె కుటుంబసభ్యులు శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

For More News..

16 లక్షలకు చేరువలో ఏపీ కోవిడ్‌ పరీక్షలు

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్

యూఎస్ సర్కార్‌‌‌‌పై ఇండియన్ మహిళ కేసు