ఇందిరమ్మ ఇండ్ల కోసం 500 అప్లికేషన్లు

ఇందిరమ్మ ఇండ్ల కోసం 500 అప్లికేషన్లు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,010 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 500 అప్లికేషన్లు ఉన్నాయి. అలాగే రెవెన్యూ శాఖకు 76, విద్యుత్​శాఖకు చెందినవి 57, పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినవి 35, ప్రవాసీ ప్రజావాణికి 6, ఇతర శాఖలకు చెందినవి 136 ఉన్నాయి. 

బ్యాక్​లాగ్​పోస్టులను అర్హులకు ఇవ్వాలని కోరుతూ గురుకులాల అభ్యర్థులు ప్రజాభవన్​ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి పర్యవేక్షణలో నోడల్​ అధికారి దివ్య దేవరాజన్​అప్లికేషన్లు స్వీకరించారు.