హైదరాబాద్ లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ కు 102 సెంటర్లు ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్​3 ఎగ్జామ్స్ కోసం హైదరాబాద్​జిల్లాలో 102 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​అనుదీప్ ​దురిశెట్టి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ఎగ్జామ్​ సెంటర్ల గేట్లు క్లోజ్​ చేస్తామని స్పష్టం చేశారు.

అభ్యర్థులు సకాలంలో సెంటర్​కు చేరుకోవాలని సూచించారు. గ్రూప్​3 ఎగ్జామ్స్​ కోసం గ్రేటర్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే బేగంపేట మయూర్ మార్గ్ వీధిలో శనివారం నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వేలో కలెక్టర్ అనుదీప్​ పాల్గొన్నారు.