
- వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద మూడో విడుత పెట్టుబడి సాయం
అమరావతి: వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద రైతులకు ఏపీ ప్రభుత్వం మూడో విడత పెట్టుబడి సాయం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమచేశారు. మొత్తం 50 లక్షల 58 వేల 489 మంది రైతుల ఖాతాల్లోకి.. వెయ్యి 36 కోట్ల రూపాయలు జమచేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి పథకం కింద ఏటా మూడు విడతల్లో 13 వేల 5వందల రూపాయల చొప్పున అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 19 వేల 812 కోట్ల 79 లక్షల రూపాయల పెట్టుబడి సాయం అందించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్: భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు రద్దు
బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్
మీ పాన్ కార్డు అసలైందేనా ? తెలుసుకోండి ఇలా..
బండ్లు, కార్ల అమ్మకాల్లో జోష్.. రాష్ట్రంలో కోటిన్నరకు చేరువైన వెహికల్స్