సుజాతనగర్, వెలుగు : జీతం చెల్లించలేదని ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచే తీసేశారని ఓ 104 ఉద్యోగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం అరగుండు, అరమీసంతో అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. 2008 నుంచి విధులు నిర్వహిస్తూ, యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నానని, జీతాలు చెల్లించడంలేదని ప్రశ్నిస్తే తనపై కలెక్టర్ కు కంప్లయింట్ ఇచ్చి ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయించారని బాధితుడు శంకర్ వాపోయాడు.
హెల్త్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ డీఎంహెచ్వో కక్షపూరితంగా వ్యవహరిస్తూన్నారని ఆరోపించాడు.