జగిత్యాలలో రికవరీ ఫోన్ల అప్పగింత

జగిత్యాలలో రికవరీ ఫోన్ల అప్పగింత

జగిత్యాల టౌన్, వెలుగు : సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందొద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. చోరీకి గురైన 104 ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ www.ceir.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఫోన్‌‌‌‌‌‌‌‌ వివరాలను నమోదు చేస్తే పోగొట్టుకున్నా, చోరీకి గురైనా తిరిగి పొందొచ్చన్నారు. 

సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో మాట్లాడిన ఎస్పీ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఐటీ కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఫీక్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ , కానిస్టేబుళ్లు మల్లేశం,అజర్, యాకూబ్ పాల్గొన్నారు.