హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 104 వాహన సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి సేవలకు తగ్గ జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్కు ఆయన లెటర్ రాశారు.
2008లో ప్రారంభమైన104 పథకాన్ని ప్రభుత్వం వివిధ కారణాలతో 2022 డిసెంబర్లో రద్దు చేసిందని తమ్మినేని తన లేఖలో చెప్పారు. అందులో పనిచేసిన ఎల్టీ, ఫార్మసిస్టులను వివిధ పీహెచ్ సీల్లో నియమించినా..వారికి ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేదన్నారు.
డాక్టర్, ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, డేటా ఏంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ,డ్రైవర్లు తదితరులు 1350 మంది సర్కారు నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.