
ఏపీలో గడిచిన 24గంటల్లో 10,418 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,27,512 గా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
కరోనా బారిన పడి మరో 74 మంది బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 4,634కు పెరిగినట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.
కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో – 9, కర్నూల్ జిల్లాలో -5, అనంతపురం జిల్లాలో – 6, చిత్తూరు జిల్లాలో – 6, నెల్లూరు జిల్లాలో – 7, ప్రకాశం జిల్లాలో -7, గుంటూరు జిల్లాలో – 6, కృష్ణా జిల్లాలో – 6, పశ్చిమ గోదావరి జిల్లాలో – 6, తూర్పు గోదావరి జిల్లాలో – 2 , శ్రీకాకుళం జిల్లాలో – 5, విజయనగరం జిల్లాలో – 3 మరణించారు.
కాగా ఇప్పటి వరకు నమోదైన 5,27,512 పాజిటివ్ కేసులకు గాను, 4,25,607 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 97,271 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.