మనోహరాబాద్‌‌‌‌ – సిద్దిపేట రైల్వే లైన్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌కు రూ.105 కోట్లు

మనోహరాబాద్‌‌‌‌ – సిద్దిపేట రైల్వే లైన్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌కు రూ.105 కోట్లు

మెదక్/రామాయంపేట, వెలుగు : ఉమ్మడి మెదక్‌‌‌‌ జిల్లాలోని మనోహరాబాద్‌‌‌‌ – సిద్దిపేట రైల్వే లైన్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌కు రూ.105 కోట్లు మంజూరు అయ్యాయని సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వే ప్రిన్సిపల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎలక్ట్రికల్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ బ్రిజ్‌‌‌‌ మోహన్‌‌‌‌ మీనా చెప్పారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తి కాగానే పనులు మొదలవుతాయన్నారు. 

అక్కన్నపేట రైల్వే స్టేషన్‌‌‌‌ నుంచి మెదక్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ వరకు రూ.15.49 కోట్లతో చేపట్టిన ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ లైన్‌‌‌‌ పూర్తి కావడంతో మంగళవారం ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిజ్‌‌‌‌ మోహన్‌‌‌‌ మాట్లాడుతూ సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ చేపట్టి వందేళ్లు అయిందన్నారు. అక్కన్నపేట – మెదక్​రూట్‌‌‌‌లో పనులు పూర్తి కావడంతో హైదరాబాద్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో 1,004 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ పూర్తయినట్లు చెప్పారు. 

ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ వల్ల  ఖర్చుతో పాటు పొల్యుషన్‌‌‌‌ కూడా తగ్గుతుందన్నారు. భవిష్యత్‌‌‌‌లో మెదక్‌‌‌‌ మీదుగా తిరుపతి, ముంబై వంటి దూరప్రాంతాలకు ఎలక్ట్రిక్‌‌‌‌ రైళ్లు నడిపే వీలు ఉంటుందన్నారు. మేడ్చల్‌‌‌‌ నుంచి మెదక్‌‌‌‌ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని ముత్కేడ్‌‌‌‌ వరకు 251 కిలోమీటర్లు డబ్లింగ్ కూడా మంజూరైందని వెల్లడించారు. ఈ పనులు పూర్తి అయితే ప్రస్తుతం ఉన్న క్రాసింగ్‌‌‌‌, వెయిటింగ్‌‌‌‌ సమస్యలు తీరిపోతాయన్నారు. కార్యక్రమంలో సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వ్‌‌‌‌ డీఆర్‌‌‌‌ఎం లోకేశ్‌‌‌‌ విష్ణోయ్‌‌‌‌ పాల్గొన్నారు.