కేరళలో జీఎస్టీ అధికారుల సోదాలు..105 కేజీల బంగారం సీజ్

కేరళలో జీఎస్టీ అధికారుల సోదాలు..105 కేజీల బంగారం సీజ్

కేరళలోని త్రిసూర్లో జీఎస్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బంగారం భారీఎత్తున పట్టుబడింది. బుధవారం (అక్టోబర్ 23) సాయంత్రం నుంచి రాష్ట్ర జీఎస్టీ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్న అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ఈ సోదాలు చేస్తున్నారు. మొత్తం 35 మంది బంగారం వ్యాపారుల ఇళ్లలో జరుగుతున్నాయి. ఈ దాడుల్లో లెక్క తేలని 105 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

జీఎస్టీ స్పెషల్ కమిషనర్ అబ్రహాం రెన్ ఎస్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. గోవర్ ఆఫ్ గోల్డ్ పేరుతో త్రీసూర్ లో గోల్డ్ ఇండస్ట్రీలోని గోడైన్లు, తయారీ కేంద్రాలు, దుకాణాలు, ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. గడిచిన ఐదేళ్లలో భారీగా బంగారం వ్యాపారుల మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేసినట్లు కమిషనర్ తెలిపారు. 

చాలామంది గోల్డ్ వ్యాపారులు పన్ను చెల్లించకుండానే బంగారం లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయన్నారు. బుధవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న సోదాల్లో ఇవాళ ( గురువారం అక్టోబర్ 24) మధ్యాహ్నానికి ముగిస్తాయని  చెప్పారు.